అంబేద్కర్ ను అవమానించిన అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సోమవారం శ్రీ సత్య సాయి జిల్లా చిలమత్తూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందర నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం ప్రవీణ్ మాట్లాడుతూ అంబేద్కర్ ను పార్లమెంటు లో అవమానపరుస్తూ అహంకారంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్షమాపణ చేప్పి రాజీనామా చేయాలని లేనిపక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని డిమాండ్ చేశారు.