శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన హిందూపురం వన్ టౌన్ సిఐ రాజగోపాల్ నాయుడు, టూ టౌన్ సిఐ అబ్దుల్ కరీం, హిందూపురం రూరల్ సిఐ జనార్ధన, చిలమత్తూరు ఎస్ఐ మునీర్ అహ్మద్ లు హిందూపురంలో శుక్రవారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చంలు అందజేశారు. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఎస్పీ సూచించారు.