హిందూపురం పట్టణంలో మంగళవారం సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా సాయిరాం ఫంక్షన్ హాల్లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలోని నాయకులు వాళ్ల అధికారాన్ని సుస్థిరం చేసుకుని లబ్ధి పొందడం కోసం రాబోయే 10 ఏళ్లు మేమే అధికారంలో ఉంటామని అంటున్నారని విమర్శించారు. మతాల మధ్య తగాదా పెట్టి మెజారిటీ ఓటర్లైన హిందువుల ఓట్లు సాధించి అధికారం అనుభవిస్తున్నారని కేంద్రంపై ఫైర్ అయ్యారు.