హిందూపురం వన్ టౌన్, పోలీస్ సర్కిల్ స్టేషన్ ను శుక్రవారం జిల్లా ఎస్పీ రత్న ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసు స్టేషన్ లోని రిసెప్షన్ కౌంటర్, రికార్డుల నిర్వహణ, లాకప్ గదులు, పోలీసు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. సిబ్బంది పనితీరును ఆరాతీశారు. పెండింగ్ కేసులు పై నిర్లక్ష్యం చేయకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. హిందూపురం పోలీస్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి సూచనలు ఇచ్చారు.