ఎంజీఎం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీవైఈఓ

72చూసినవారు
ఎంజీఎం పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీవైఈఓ
హిందూపురం పట్టణంలోని మహాత్మాగాంధీ మున్సిపల్ ఉన్నత పాఠశాలను డీవైఈఓ రంగస్వామి బుధవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు పట్టిక, వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అందించిన విద్యాకానుక కిట్ల వివరాలు, మధ్యాహ్న భోజన వివరాలను పరిశీలించగా రికార్డులు సరిగా లేకపోవడంతో హెచ్ఎం సామ్రాజ్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్