సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకు చోళసముద్రం వద్ద ఉన్న డా. అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని జిల్లా కలెక్టర్ అరుణ్బాబు అన్నారు. ఆదివారం స్ట్రాంగ్ రూవ్ లవద్ద ఆయన జిల్లా ఎన్నికల సీఈఓ ముఖేష్ కుమార్ మీనతో సంభాషించారు. ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తీచేశామన్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ ప్రక్రియ ఈనెల 4న 8గంటలకు ప్రారంభించాలన్నారు.