గోరంట్ల మండలంలోని ముత్తరాయనితండాలో చోటుచేసుకున్న ఘర్షణ హత్యకు దారి తీసింది. గ్రామ మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన భాస్కర్ నాయక్‌ను లోకేశ్ (45) మందలించాడు. ఈ విషయంలో కోపంగా ఉన్న భాస్కర్, శుక్రవారం సాయంత్రం భవన పనుల నుంచి వచ్చిన తరువాత లోకేశ్ తలపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనలో లోకేశ్ అక్కడికక్కడే మృతిచెందగా, భాస్కర్ కు గ్రామస్థులు దేహశుద్ధి చేశారు.