చిలమత్తూరు గ్రామ పంచాయితీలో గత కొన్ని రోజులుగా బోరు బిల్లులు, ఇతరత్రా నిధులు మళ్ళింపుపై వస్తున్న ఆరోపణలు గురించి శనివారం పంచాయతీరాజ్ జిల్లా అధికారులు డి ఎల్ పి ఓ, ఈ ఓ ఆర్ డి చిలమత్తూరు పంచాయతీ కార్యాలయంలో గత పంచాయతీ సెక్రటరీ, పంచాయతీ సర్పంచ్ సమక్షంలో విచారణ చేపట్టారు. విచారణలో సంబంధిత బిల్లులు పరిశీలించడానికి, బిల్లులకు సంబంధించన రికార్డులను జిల్లా కార్యాలయానికి తీసుకెళ్లినట్టు తెలిపారు.