శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని రహమత్పూర్ సర్కిల్ నందు మంగళవారం ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కనిశెట్టిపల్లి వినోద్ కుమార్, జిల్లా కోశాధికారి డి. బాబు రహమత్ ఆటో స్టాండ్ ను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ ఆటో యూనియన్ వర్కర్స్ అందరూ యూనిఫామ్స్ ధరించాలని, తాగి ఎవరూ బండి నడుపురాదని, ప్రతి ఒక్కరూ సీరియల్ పాటించాలని, తదిత నియమ నిబంధనలను వారికి తెలియజేశారు. నూతన కమిటీ అధ్యక్షులుగా అజమత్, కార్యదర్శిగా హుస్సేన్ తదితరులను ఎన్నుకున్నారు.