హిందూపురం: టీడీపీ కార్యకర్తపై దాడి

79చూసినవారు
హిందూపురం: టీడీపీ కార్యకర్తపై దాడి
హిందూపురం పట్టణంలోని కోట ప్రాంతంలో నివాసముంటున్న టిడిపి మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షులు ఎండీఎస్ హిదాయత్ పై శనివారం సాయంత్రం కొందరు వ్యక్తులు కత్తితో దాడి చేసిన సంఘటన చోటుచేసుకుంది. ప్రత్యర్థులు ఒక్కసారిగా కత్తితో పొడవడానికి ప్రయత్నం చేశారు. దీంతో హిదాయత్ పెద్దగా అరవడంతో తప్పించుకుని పారిపోయారు. దాడిలో గాయపడిన హిదాయత్ ను స్థానికులతో కలిసి కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్