మాజీ సీఎం జగన్ పై హిందూపురం ముదిరెడ్డిపల్లికి చెందిన టీడీపీ గుండా మోహన్ అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారని వైసీపీ నేతలు శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుడ్డంపల్లి వేణు రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో సీఐ ఫిర్యాదు చేసినట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. హిందూపురంలో గతంలో ఎన్నడూ ఇలాంటి సంస్కృతి లేదని, టీడీపీ వారు కావాలనే వైసీపీ నాయకులను టార్గెట్ తో రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేస్తున్నారన్నారు.