హిందూపురం పరిధిలో ఓ వ్యక్తికి రక్తం అవసరమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న విషయం హిందూపురం ఒకటవ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శివ దృష్టికి వచ్చింది. ఈ క్రమంలో ఆయన శనివారం రక్తదానం చేశారు. ఇప్పటి వరకు 28 సార్లు రక్తదానం చేసినట్లుఆయన వివరించారు. అలాగే సమయానికి రక్తదానం చేసిన కానిస్టేబుల్ కు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు