హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పోలీసులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మాధవ్‌తో పాటు మరో ఐదుగురిని 14 రోజుల రిమాండ్ కు తరలించారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడితో పాటు విధి నిర్వహణలో ఉన్న పోలీసులను అడ్డుకున్న కేసులో గోరంట్లకు గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది. నెల్లూరు జైలుకు రిమాండ్ కు పంపాలని భావించగా, అక్కడ ఇబ్బందులున్నాయని, న్యాయమూర్తి ఆదేశాలతో రాజమండ్రికి తరలించారు.