హిందూపురం ఎంపీ బీకే పార్థసారథిని శనివారం ఉమ్మడి జిల్లా కురుబ సంఘం నేతలు కలిశారు. రాష్ట్ర కురుబ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ గా రాజశేఖర్ గౌడ్ ఎన్నికైన సందర్భంగా ఎంపీ ఆయనను అభినందించారు. మండల, జిల్లా కమిటీలను త్వరగా ఏర్పాటు చేసి సంఘ బలోపేతానికి పనిచేయాలని సూచించారు. తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు.