హిందూపురం మున్సిపల్ నూతన కమిషనర్ గా మల్లికార్జున శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పక్షాలతోనూ ఉద్యోగులతో సమన్వయం చేసుకొని హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈయన వైసిపి ప్రభుత్వ హయాంలో ధర్మవరం మున్సిపల్ కమిషనర్ గా పనిచేస్తూ అప్పటి ప్రతిపక్ష సభ్యులను ఇబ్బంది పెట్టాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు.