హిందూపురం మునిసిపల్ కార్యాలయంలోమంగళవారం నీటి సమస్య పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్ పర్సన్ డి. ఈ. రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య, మునిసిపల్ కమిషనర్ సంఘం శ్రీనివాసులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. వేసివి కాలంలో నీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని వార్డులలో వాటర్ లీకేజ్ లు ఎక్కడెక్కడ ఉన్నాయో కనుకోవాలన్నారు .లీకేజ్ లను అరికట్టి నీటి సమస్యలు లేకుండా చేయాలన్నారు.