హిందూపురం: క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ

79చూసినవారు
హిందూపురం: క్షతగాత్రులను పరామర్శించిన ఎంపీ
పరిగి మండలం ధనాపురం క్రాస్ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులను హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న హిందూపురం ఎంపీ బికే పార్థసారథి మధ్యాహ్నం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జరిగిన దుర్ఘటన అత్యంత బాధాకరమని మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్