సద్గురు యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో చేపట్టిన అన్నదానాన్ని మంగళవారం హిందూపురం మున్సిపల్ చైర్మన్ డిఈ రమేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పేదల ఆకలి తీర్చేందుకు ప్రతిరోజు యోగి నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని దాతల సహకారంతో నిర్వహించడం అభినందనీయమన్నారు. దాతలు ఇలాంటి అన్నదాన కార్యక్రమానికి తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు.