హిందూపురం నియోజకవర్గం లేపాక్షి పోలీసులు రెండు గుడి దొంగతనాల కేసులను విజయవంతంగా చేధించి, నిందితుడు బెంగుళూరు నివాసి గిరీష్ ను సోమవారం అరెస్ట్ చేశారు. ఈనెల 1న రాత్రి లేపాక్షి మండలంలోని సిరివరం గ్రామంలో మహాదేవేశ్వర స్వామి గుడిలో ప్రవేశించి, హుండీ పగులగొట్టి రూ.7,000 నగదు, 3 గ్రాముల బంగారు తాళిబొట్టు దొంగిలించాడు. దొంగిలించిన బంగారాన్ని బెంగుళూరులో విక్రయించాడు. లేపాక్షి పోలీసులు నేడు బిసలమనేంపల్లి గ్రామంలో శివాలయం సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.