హిందూపురం: ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల తీర్మానం

68చూసినవారు
హిందూపురం: ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యుల తీర్మానం
హిందూపురంలో గల ప్రెస్ క్లబ్ లో కమిటీ సభ్యులు మంగళవారం సమావేశాన్ని నిర్వహించి ఒక తీర్మానం చేశారు. వారు మాట్లాడుతూ హిందూపురంలో ప్రజా సమస్యల పరిష్కారమే దిశగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్ ధరకు కేటాయించిన స్థలాన్ని సిపిఎం పార్టీ పేదల పేరుతో భూ కబ్జాలకు పాల్పడుతూ ఆ పార్టీ నాయకులు సోమవారం రోజు ఆ స్థలంలో సిపిఎం పార్టీకి చెందిన ఎర్రజెండా ఆవిష్కరించడం సిగ్గుచేటుగా భావిస్తూ ఇక ఆ పార్టీకి సంబంధించిన వార్తలను పత్రికల్లో, టీవీ ఛానల్లో ప్రచురించకుండా వార్తలను నిలిపివేస్తూ తీర్మానించారు. పార్టీ చేపట్టే అనవసరమైన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వకుండా ఉండాలని హిందూపురం పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్