హిందూపురంలోని అంబేడ్కర్ సర్కిల్ పక్కన గురువారం బైక్ చోరీ జరిగింది. రిటైర్డ్ ఏఎస్ఐ రామలింగప్పకు చెందిన హోండా షైన్ బైక్ ను గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ వేసుకుని వచ్చి తీసుకెళ్లాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ ప్రారంభించారు. భద్రత చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.