హిందూపురం వైసీపీ కార్యాలయంలో దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి ఉత్సవాల నిర్వహణపై నేత వేణు రెడ్డి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 8న జరిగే కార్యక్రమాలపై చర్చించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్లు, కౌన్సిలర్లు, వైకాపా శ్రేణులు పాల్గొన్నారు.