హిందూపురం పట్టణంలో పలని నగర్, ఇందిరా నగర్ లోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రథోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ డి. ఈ. రమేష్ కుమార్ హాజరయ్యారు. నోటి పైన, నాలుక పైన, వీపు పైన పెద్ద సూలాలు గుచ్చుకోవడం, ఆ స్వామివారిని స్మరిస్తూ రథం లాగడం నిజంగా ఆ దేవుని ఆశీస్సులేనని రమేశ్ కుమార్ అన్నారు. కౌన్సిలర్ సతీష్ కుమార్, హనుమంతు, సుమో సీనా, మంగేష్, దుర్గా నవీన్ ఉన్నారు.