హిందూపురం మండల పరిధిలోని బాలంపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంగాధర్ అనారోగ్య కారణాలతో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. గంగాధర్ సి. చెర్లోపల్లి గ్రామంలోని ఏపీ మోడల్ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా ఉన్నారు. బాధితుడు కొద్దిరోజులుగా అనారోగ్యంతో హిందూ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.