హిందూపురం: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం

51చూసినవారు
హిందూపురం: ఒకే కాన్పులో ముగ్గురు బిడ్డల జననం
హిందూపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చారు.
రొద్దం మండలం శేషాపురం గ్రామానికి చెందిన శిల్ప బుధవారం రాత్రి పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చారు.
గురువారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సాధారణ ప్రసవంలో ఇద్దరు మగ, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చారని డా. నీరజ తెలిపారు. శిశువుల బరువు తక్కువ ఉండటంతో అనంతపురం రెఫర్ చేశామన్నారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు.

సంబంధిత పోస్ట్