హిందూపురం: ఎమ్మార్వోకు వినతి పత్రం సమర్పించిన కార్మికులు

51చూసినవారు
హిందూపురం పట్టణంలోని శ్రీరామ్ రెడ్డి వాటర్ సప్లై స్కీం కార్మికులకు గత 11 నెలలుగా వేతనాలు పడలేదని సీఐటీయూ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ గతంలో కూడా వాటర్ పంపులను ఆఫ్ చేసి సమ్మెకు సిద్ధమవుతున్న సమయంలో అధికారులు జోక్యం చేసుకొని, మీకు ప్రభుత్వం స్పందించకపోతే వేతనాలు మా సొంత నిధులతో వేస్తామని చెప్పి, ఇప్పటి వరకు పట్టించుకోకపోవడం సమాజసం కాదన్నారు.

సంబంధిత పోస్ట్