హిందూపురం పట్టణ పరిధిలోని బెంగళూరులో రోడ్డులో వెలసిన అయ్యప్ప స్వామి దేవస్థానంలో శనివారం అయ్యప్ప మాలధారణ స్వాములకు ముదిరెడ్డిపల్లి 35వ వార్డు కౌన్సిలర్ మద్దన జయరాములు పద్మావతి దంపతులు ఆధ్వర్యంలో అన్న, ప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు దాతలకి ప్రత్యేక పూజలు నిర్వహించి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మద్దన జయరాములు వారి కుటుంబ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.