చిలమత్తూరులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లేందుకు శనివారం కూటమి నాయకులు విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించారు. ఈ సందర్బంగా జనసేన, టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రికి, హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణకి కూటమి నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు పథకాన్ని అమలు చేసినందుకు హర్షిస్తూ, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.