హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం సోమగట్టలో మంగళవారం లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో స్వామివారి బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ బ్రహ్మరథోత్సవంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని డప్పులతో, కొలాటాలతో ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. యువకులు పోటాపోటీగా రథాన్ని లాగుతూ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ మహోత్సవంలో స్వామి ప్రతేక అలంకరణతో భక్తులకు దర్శనం ఇచ్చారు.