హిందూపూరం సిల్క్ కాలనీలో శుక్రవారం మున్సిపల్ ఛైర్మన్ రమేశ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని సమస్యలను ప్రజలతో మాట్లాడి తెలుసుకున్నారు. రోడ్లు, కాలువల నిర్మాణం చేస్తామన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో సిల్క్ కాలనీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.