శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా బుధవారం పోలీసులు వాహనాలు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో ప్రజల భద్రత, రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం జిల్లా అంతట విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు, ఫుట్ పెట్రోలింగ్ లు చేపట్టారు. రోడ్లపై ఆకతాయిలు మహిళల పట్ల ఎవరైనా యూటీజింగ్, చేసేవారిపై ప్రత్యేక దృష్టిసారించారు.