ఓ దళిత బాలికపై అత్యాచారం జరిగిన ఘటన నేపథ్యంలో గురువారం రాప్తాడు మండలం పేరూరులో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వెళ్లనివ్వకుండా వైసీపీ నాయకులు గుడ్డంపల్లి వేణురెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా పెనుకొండ పోలీస్ పరిధిలో దీపిక వేణు రెడ్డి, ఉషశ్రీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో వారు మాట్లాడుతూ దళిత మహిళకు జరిగిన అన్యాయాన్ని, వారి కుటుంబీకులను పరామర్శిండానికి వెళ్లడమే తప్పా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.