హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సూచనల మేరకు సూరప్ప కట్ట చెరువును సుందరీకరణ చేయాలని శుక్రవారం మున్సిపల్ అధికారులతో సందర్శన ప్రతిపాదనలకు సిద్ధం చేయడం జరిగింది. చెరువు ప్రాంతమంతా చదును చేసి చక్కటి నీటితో నింపడం పచ్చదనంతో కళకళ లాడే విధంగా ఈ ప్రాంతమంత తయారు చేయమని తెలిపారు. అందుకు సంబంధించిన మకన్సల్టెంట్ కంపెనీ వారు పరిశీలించారు. త్వరలోనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వారికి సూచించారు.