హిందూపురంపట్టణంలో జర్నలిస్ట్ అసోసియేషన్ఆఫ్ యూట్యూబర్స్ జిల్లా కార్యాలయం ప్రారంభోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. జై యూనియన్ రాష్ట్ర నాయకుల ఆదేశాల మేరకు హిందూపురంలో జిల్లా కార్యాలయం ఏర్పాటు చేసినట్టు జై యూనియన్ రాష్ట్ర నాయకులుచాంద్ భాషా తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పట్టణంలోని ప్రముఖవ్యాపారవేత్త, డిసిసి అధ్యక్షులు ఎంహెచ్ ఇనాయతుల్లా, ఎంఈ కిఫాయతుల్లా, పర్యావరణవేత్త భాస్కర్ రెడ్డి విచ్చేశారు.