చిన్నారులకు మానసీక, శారీరక దృఢత్వం అంగన్వాడి కేంద్రాలతోనేనని ఐసీడీఎస్ సీడిపిఓ రెడ్డి రమణమ్మ పేర్కొన్నారు. శుక్రవారం కొడికొండలోని అంగన్వాడి కేంద్రాంలో ఐదేళ్లు పూర్తీ చేసుకున్న చిన్నారులకు ఘనంగా గ్యాడ్యుయేషన్ కార్యక్రమం నిర్వహించి ప్రాథమిక పాఠశాలకు పంపారు. ఆమె మాట్లాడుతూ మూడు సంవత్సరాల చిన్నారులను అంగన్వాడీకు తీసుకువచ్చి తల్లిప్రేమతో వారికి ఆటపాటలతో కూడిన విద్య అందించడం జరుగుతుందన్నారు.