జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు నాగబాబును హిందూపురం జనసేన నాయకులు ఆదివారం కలిశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పురం జనసేన అధ్యక్షుడు ఆకుల ఉమేష్, పట్టణాధ్యక్షుడు కొల్లకుంట శేఖర్, చిలమత్తూరు మండల కన్వీనర్ చిన్న ప్రవీణ్, లేపాక్షి జనసేన నాయకులు లోకేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. జనసేన పార్టీకి ఇటీవల చౌకధాన్యపు డిపోలు, ఇతర పనుల్లో కల్పించిన సముచిత స్థానం పై నాగబాబు దృష్టికి తీసుకెళ్లారు.