లేపాక్షి: యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్

73చూసినవారు
లేపాక్షి: యోగాసనాలు వేసిన జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్
ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయాలని, యోగాసనాలతో శారీరక రుగ్మతలు దూరం అవుతాయని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ అన్నారు. మంగళవారం ప్రముఖ పర్యాటక ప్రదేశం లేపాక్షి ఆలయ ప్రాంగణంలో పర్యాటక శాఖ యోగా దినోత్సవ కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఆయన మనసు ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండాలంటే యోగాసనాలు వేయాలన్నారు. ప్రతీరోజు యోగా చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్