హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలం వివేకానంద జిల్లా పరిషత్, నీలం సంజీవరెడ్డి ఓరియంటల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎంఈఓ నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల సముదాయ సమావేశాలు నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలు బడిలో ఉండే విధంగా ఉపాధ్యాయులు చొరవ చూపాలన్నారు. ప్రతి విద్యార్థికి స్థాయికి తగిన విధంగా విద్యా బోధన చేయాలన్నారు. ఆధునిక పద్ధతిలో విద్యార్థులకు అర్థం అయ్యే విధంగా విద్యా బోధన ఉత్తమమన్నారు.