ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

67చూసినవారు
ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
ఏపీ సి సి చీఫ్ వైయస్ షర్మిలరెడ్డి ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ ఎంహెచ్ ఇనాయతుల్లా ఆధ్వర్యంలో హిందూపురంలో బుధవారం మహాత్మగాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో గాంధీ సర్కిల్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఇనయతుల్లా ఆ మహనీయుని సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్