గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం

82చూసినవారు
గురుకుల పాఠశాలలో వైద్య శిబిరం
హిందూపురంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యాధికారిణి డాక్టర్ అను రాధ ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమం, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జలుబు, దగ్గు, జ్వరము, మలేరియా, టైఫాయిడ్, డెంగీ లక్షణాలు, తీసు కోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులను పరీ క్షించి వారికి కావాల్సిన మందులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్