గ్రామీణ ప్రాంతాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే టీడీపీ ప్రధాన లక్ష్యమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. శుక్రవారం లేపాక్షి మండలం మానెంపల్లిలో ఎంపీనిధులు రూ. 16లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. గ్రామస్థులు మాట్లాడుతూ హిందూపురం నుంచి శిరివరంకు వచ్చే రహదారిలో పులమతి మరువ వద్ద ఉన్న రహదారి అధ్వాన్నంగా ఉందని మరమ్మతులు చేయించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.