హిందూపురం పట్టణ కేంద్రంలో శనివారం రెండవ రోజు మున్సిపల్ కార్మికుల రిలే నిరాహార దీక్ష కొనసాగింది. కార్మికులు రెండవ రోజు వినుతమైన పద్ధతిలో దీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు జడ్పీ శ్రీనివాసులు, సిఐటియు పట్టణ కన్వీనింగ్ కమిటీ నాయకులు రాము, రామకృష్ణ, మరియు మున్సిపల్ యూనియన్ కమిటీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.