పరిగి ఫ్రీకాట్ బి మిల్లు మూత పడకుండా ప్రభుత్వం యాజమాన్యంతో వెంటనే చర్చలు జరపాలని సిపియం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి. రాంభూపాల్ డిమాండ్ చేశారు. శనివారం అయన మిల్లు వద్ద మాట్లాడుతూ మిల్లు మూసివేతపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించాలని ఎన్టీఆర్ 1983లో హిందూపురం ప్రాంతానికి తీసుకువచ్చిన పరిశ్రమ మూసివేతకు సిద్ధంగా ఉండగా దీనిపై ముఖ్యమంత్రి, మంత్రిగా వున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు స్పందించాలన్నారు.