పరిగి మండల కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ ధర్మరక్ష నిధికి బిజెపి పరిగి మండల నాయకుడు వేణుగోపాలరావు రూ. 50,116 రూపాయల విరాళాన్ని విశ్వహిందూ పరిషత్ దక్షిణ ప్రాంత అధ్యక్షుడు నంది రెడ్డి సాయి రెడ్డికి బుధవారం అందజేశారు. విశ్వహిందూ పరిషత్ చేస్తున్న ఆధ్యాత్మిక ధర్మ రక్ష కార్యక్రమం గురించి ఇరువురు చర్చించారు.