హిందూపురం రూరల్ మండలం కొటిపి రోడ్డులోని లయోలా స్కూల్ వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు పల్సర్ బైకు, సూపర్ ఎక్సెల్ రెండూ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లేపాక్షి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన శేఖర్, ధర్మవరానికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికులు వెంటనే వారిని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి 108 ద్వారా తరలించారు.