హిందూపురం పట్టణంలోని ఎస్టి జి ఎస్ కళాశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావలి మాట్లాడుతూ మహారాష్ట్రలోని సత్తార్ జిల్లాలో 1831 జనవరి3 న జన్మించిన సావిత్రిబాయి చిన్నవయసులోనే వివాహాన్ని చేసుకుంది. అప్పటినుంచి భర్త జ్యోతిరావు పూలే అడుగుజాడల్లో నడిచి తొలి బాలికపాఠశాలను ప్రారంభించిన మహిళావిద్యావేత్త అని కొనియాడారు.