హిందూపురంలో ఏర్పాటు చేసే వినాయక విగ్రహలను నిమజ్జనం చేసే ప్రాంతాలను బుధవారం సాయంత్రం సత్యసాయి జిల్లా ఎస్పి రత్న పరిశీలించారు. హిందూపురంలోని రహమత్పూర్, బాలాజీ సర్కిల్, ఎన్ టీ ఆర్, అంబేద్కర్ సర్కిల్, పరిగి బస్టాండ్ తదితర ప్రాంతాలను పరిశీలించిన ఎస్పి భద్రత, బందోబస్తు ఏర్పాటును పరిశీలించారు. విగ్రహాలను నిమజ్జనం చేసే సమయంలో ట్రాఫిక్ అంతరాయాలు కలగకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలనే అంశంపై చర్చించారు.