ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ సోమవారం పుట్టపర్తికి రానున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి విమానాశ్రయాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. ఆదివారం సాయంత్రం జిల్లా ఎస్పీ రత్న పోలీస్ అధికారులతో పాటు విమానాశ్రయ అధికారులతో కలిసి రన్ వేను పరిశీలించారు. నారా లోకేశ్ విమానాశ్రయానికి రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు.