శ్రీ సత్యసాయి: సమ్మెను విజయవంతం చేయండి: సీఐటీయూ

73చూసినవారు
శ్రీ సత్యసాయి: సమ్మెను విజయవంతం చేయండి: సీఐటీయూ
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరులో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బుధవారం కరపత్రాలు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. మే 20న దేశవ్యాప్తంగా జరగబోయే కార్మిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు తెలిపారు. కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలని, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక కార్మిక విధానాలను వ్యతిరేకించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమ్మెను జయప్రతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్