తూమకుంట: కార్మికులకు బకాయి పడ్డ జీతాలు ఇప్పించండి

59చూసినవారు
తూమకుంట: కార్మికులకు బకాయి పడ్డ జీతాలు ఇప్పించండి
తూమకుంట పారిశ్రామిక వాడలోని "ఆఫ్ట్రా సింథసిస్ ప్రైవేట్ లిమిటెడ్" అను రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి దాదాపు 28 మంది కార్మికులకు కొంతమందికి రెండు నెలల జీతాలు, మరి కొంతమందికి మూడు నెలల జీతాలు చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మికులు వాపోతున్నారు. గత వారం రోజుల నుండి పలుమార్లు వెళ్లి మా జీతాలు చెల్లించండి అని ప్రాదేయపడిన యాజమాన్యం స్పందించడం లేదన్నారు. ఈ విషయం బాధిత కార్మికులు తూముకుంట పారిశ్రామిక వాడ కార్మిక సంఘం అధ్యక్షులు రవికుమార్ దృష్టికి తీసుకుపోగా వారు మద్దతుగా నిలిచి కార్మిక శాఖ అధికారి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ శేఖర్ బాబుకి వినతి పత్రం అందజేసారు.

సంబంధిత పోస్ట్